Thursday, April 24, 2025

తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా

  • చరిత్రలోనే పెద్ద సభ.. రజతోత్సవ సభ..
  • బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు
  • బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • ఎల్కతుర్తిలో రజితోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేటీఆర్

తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని, ఎవరికి ఏ కష్టం వొచ్చినా కెసిఆర్ వైపు, తెలంగాణ భవన్ వైపు చూస్తారని గులాబీ జెండాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండల కేంద్రంలో ఈనెల 27న మాజీ ముఖ్యమంత్రి, గులాబీ అధినేత కెసిఆర్ హాజరయ్యే టిఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను కేటీఆర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ నిర్వహించే రజోత్సవ సభ ఆషామాషీ సభ కాదని, చరిత్రలోని అతిపెద్ద సభ అని అభివర్ణించారు. కెసిఆర్ ఎప్పుడు ఉద్యమ సందర్బం వొచ్చినా వరంగల్ వైపు చూసేవారని, వరంగల్ నేతల విజ్ఞప్తి మేరకు ఇక్కడే సభ నిర్వహించడం అందరికీ గర్వకారణమని అన్నారు. రజతోత్సవ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 1200 ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయని అలాగే మరో వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు.

కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ వైపు నుంచి వొచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో సభ వద్దకే వాహనాలు చేరుకుంటాయని తెలిపారు. సభకు వచ్చేవారం కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన అవసరం లేదన్నారు. మండు వేసవి అయినందున 10 లక్షల వాటర్ బాటిల్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 100 ప్రత్యేక వైద్య బృందాలు, 20 అంబులెన్సులు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే సహాయం అందిస్తారని, విద్యుత్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున 2 జనరేటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా, సభలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా 2000 మంది వాలంటీలను నియమిస్తున్నామని తెలిపారు. 12796 గ్రామ పంచాయతీల నుండి, అలాగే అన్ని మునిసిపల్ డివిజన్లో నుండి చలో వరంగల్ అంటూ కార్యకర్తలు కదంతో కాలని ఆయన పిలుపునిచ్చారు. కెసిఆర్ ఇచ్చే సందేశం వినేందుకు ఉత్సాహంగా ప్రజలు ఉన్నారని, ఆయన ఇచ్చే సందేశాన్ని గ్రామ గ్రామానికి చేరవేయాలని అన్నారు. ఇది కాంగ్రెస్ వ్యతిరేక సభ కాదని, తమ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న వార్షికోత్సవమని, ఇది ఉత్కృష్ట సందర్భమని, అధికార యంత్రాంగం ఇప్పటివరకు సహకరించుకుంటూ వస్తుందని, ఇకముందు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట వంటి సుదూర ప్రాంతాల నుండి ఎడ్లబండ్లను కట్టుకొని సభకు రావడం చూస్తుంటే.. ప్రజల్లో రైతాంగన్లో ఎలాంటి ఉత్సాహం ఉందో అర్థం అవుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సభకు తరలి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. బి ఆర్ ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల ఉద్యమాన్ని నడిపిందని, పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, ప్రస్తుతం ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తుందని కేటీఆర్ అన్నారు. ఎన్నో ఉద్యమ సంస్థలు రాష్ట్రంలో దేశంలో పుట్టిన అవి కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ 25 ఏళ్లు సమర్థవంతంగా కేవలం టిఆర్ఎస్ టిడిపి మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని కెసిఆర్ హిమాలయాలకు తీసుకువెళ్లారని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వొచ్చినా తెలంగాణ భవన్ వైపు చూస్తారని, లెగిచర్ల బాధితులైన హైడ్రా బాధితులైన మూసి బాధితులైన హెచ్ సియు విద్యార్థులైనా ఎవరికైనా గులాబీ జెండా ఉందని ధైర్యం ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు ఎక్కడికక్కడ జన సమీకరణ కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారని తెలిపారు. పూర్వ వరంగల్ జిల్లా నేతలు బహిరంగ సభ ఏర్పాట్ల కోసం గత 15 రోజులుగా శ్రమిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వి సతీష్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటిపల్లి రాజయ్య, ధర్మ రెడ్డి, నాగూర్ల వెంకన్న, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తక్కల్లపల్లి  రవీందర్రావు, వద్దిరాజు రవిచంద్ర, వాసుదేవ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, రాకేష్ రెడ్డి, స్థానిక నాయకులు తంగెడ మహేందర్, తంగడ నగేష్, శ్రీపతి రవీందర్, చిట్టి గౌడ్, గొల్లె మహేందర్, ఎల్తూరి స్వామి, శేషగిరి,  తదితరులు పాల్గొన్నారు.

కశ్మీర్ లో  ఉగ్రవాద ఘటన దారుణం
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు టూరిస్టులపై కిరాతకంగా అమానవీయంగా కాల్పులు జరపడం దారుణమైన సంఘటన అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఎల్కతుర్తి కి వొచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కశ్మీర్ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని టూరిస్టులకు భద్రత కల్పించాలని కోరారు. సుమారు 25 మందికి పైగా టూరిస్టులను తీవ్రవాదులు కాల్చి చంపడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తో పాటు బిఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com