Thursday, December 26, 2024

కొండా సురేఖ గ‌తంలో ఉచ్చ ఆగ‌డం లేదా అని అన‌లేదా..? : కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కొండా సురేఖమ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. గ‌తంలో త‌మ‌పై ట్రోలింగ్ పేరుతో దాడి జ‌ర‌గ‌లేదా..? కొండా సురేఖ గ‌తంలో ఉచ్చ ఆగ‌డం లేదా అని అన‌లేదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌ లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడ‌బొబ్బలు దేనికి..? బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఆమెపై ఎవ‌రు మాట్లాడ‌లేదు.. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా..? ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తాన‌ని కేటీఆర్ తెలిపారు. ఇదే కొండా సురేఖ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని గ‌తంలో కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా.. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి అని కేటీఆర్ సూచించారు.

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com