బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోంది. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పైన, తమ కంపెనీ కార్యకలాపాల పైన ఆ పథకం యొక్క ప్రభావాన్ని వ్యక్తపరిచినందుకు L&T వంటి ప్రముఖ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని జైలుకు పంపిస్తాను అంటూ ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తానంటూ రేవంత్ బెదిరింపులకు పాల్పడడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితికి అర్ధం పడుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో రేవంత్ పరిశ్రమలకు ఏ సందేశం పంపుతున్నాడు?. ఇదేనా రాహుల్ గాంధీ గారు దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహమంటూ కేటీఆర్ ఎద్దేవా.