Monday, November 18, 2024

మంత్రి కొండా సురేఖకు కెటిఆర్ క్షమాపణలు చెప్పాలి

  • కొండా సురేఖ విషయంలో కెటిఆర్ పెద్దరికంగా వ్యవహారించాలి
    కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్

మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కె. తారాక రామారావు మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌పై కెటిఆర్ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సిఎం కెసిఆర్, కెటిఆర్‌కు దండలు వేసిన ఆడవాళ్లను అలాగే చూస్తారా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ నేతలు రాష్ట్రంలో ఎలాంటి సంస్కృతీని తీసుకొస్త్తున్నారని జగ్గారెడ్డి నిలదీశారు. కొండా సురేఖ విషయంలో పెద్దరికంగా వ్యవహారించాలని జగ్గారెడ్డి కెటిఆర్‌కు సూచించారు. పదేళ్ల పాటు రాజభోగాలు అనుభవించి పరిజ్ఞానం లేని వ్యక్తిలా మాట్లాడవద్దన్నారు. మరో పదేళ్లు ఆగి పరిపూర్ణ చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, డేటా సరిగా లేకపోవడం వలన మిగతా రైతుల రుణమాఫీ కాలేదన్నారు. డేటా సరి చేసుకొని మిగతా రైతులకు రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular