Thursday, November 7, 2024

KTR Narcotic Tests కెటిఆర్ నార్కోటిక్ టెస్టులు చేయించుకోవాలి

  • ఫాంహౌస్‌లో దొరికిన డ్రగ్స్, లిక్కర్,
  • అమ్మాయిలు, అబ్బాయిల వివరాలన్నీ బయటపెట్టాలి
  • ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నార్కోటిక్ టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఆరోపణలు తమపై ఎందుకు రావడం లేదని, ప్రతిసారి డ్రగ్స్‌కు సంబంధించి కెటిఆర్‌పై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిఎం రేవంత్ కెటిఆర్‌తో చాలెంజ్ చేశారని, ఇద్దరం నార్కోటిక్ టెస్ట్ చేయించుకుందామని అన్నారని, దానికి కెటిఆర్ పారిపోయారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.

మీ బామ్మర్ది ఫాంహౌస్‌లో దొరికిన డ్రగ్స్, లిక్కర్, అమ్మాయిలు, అబ్బాయిల వివరాలన్నీ బయటపెట్టాలని, అడ్డంగా దొరికి కూడా బుకాయించడానికి సిగ్గు, శరంలేదని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వారం కెటిఆర్ బామ్మర్ది రేవ్ పార్టీ పెడుతున్నారని పోలీసులకు సమాచారం ఉందని, పక్కా సమాచారంంతోనే పోలీసులు ఈ దాడి చేశారని ఆయన తెలిపారు.

చట్టం తెలిసిన వ్యక్తులే తప్పులు చేస్తే ఎలా..?
గతంలో జన్వాడ ఫాం హౌస్‌కు తనకు సంబంధం లేదు అన్నావ్, హైడ్రా ఎపిసోడ్‌తో నా దోస్త్ ఫాంహౌస్ అన్నావ్, ఇప్పుడేమో మా బామ్మర్ది ఇల్లు అని కెటిఆర్ అంటున్నారని నోరు తెరిస్తే కెటిఆర్ అబద్ధాలు ఆడతారని ఆయన విమర్శించారు. పార్టీలో లీటర్ లిక్కర్, 6 బీర్లు మాత్రమే ఉండాలని ఎక్సైజ్ నిబంధనలు ఉన్నాయని, కానీ, ఈ పార్టీలో పెద్ద ఎత్తున మద్యం పట్టుబడిందని ఆయన ఆరోపించారు. చట్టం తెలిసిన వ్యక్తులే తప్పులు చేస్తే పోలీసులు కేసులు పెట్టక పోతే ఏం చేస్తారని ఆయన నిలదీశారు.

జన్వాడ ఫాంహౌస్ ఘటనపై త్వరలో వాస్తవాలు అన్ని ప్రజల ముందు పెడతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్ ఎగురవేసినందుకు, వాస్తవాలు బయటపెట్టినందుకు ఆ రోజు ఎంపిగా ఉన్న రేవంత్ రెడ్డిని బిఆర్‌ఎస్ ప్రభుత్వం 40 రోజులు జైల్లో పెట్టిందని, అండర్ ట్రయల్ ముద్దాయిగా జైల్లో పెట్టి రేవంత్ రెడ్డిని చంపాలని చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు జైల్లో రేవంత్ రెడ్డి హత్యకు కుట్ర చేస్తే ప్రజల అతడిని ముఖ్యమంత్రిని చేశారన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular