ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదోప వాదనలు జరుగాయి. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు కేటీఆర్ తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవే తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్‌లో ఉన్న 409 సెక్షన్‌పై తొలుత వాదనలు జరిగాయి. పిటిషన్‌దారుడు అనుమతి తీసుకోలేదన్నది నిజమే.. కానీ డబ్బు ఆయా వ్యక్తులకు చేరలేదని వాదనలు మొదలు పెట్టారు. అవినీతి అన్న అంశమే లేదు కాబట్టి, ఇక్కడ సెక్షన్ 409 చెల్లదన్నారు. బ్యాంక్ ద్వారా డబ్బు చెల్లింపు జరిగిందని, ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనం ఎక్కడ ఉందని దవే వాదించారు. ఎఫ్ఈఓతో అగ్నిమెంట్‌పై సంతకం చేసింది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అని, మంత్రిగా ఉన్న కేటీఆర్ కాదన్నారు. ఎఫ్‌ఈఓను ఏసీబీ అధికారులు నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈవో మాటేంటని దవే ప్రశ్నించారు. ఫార్ములా ఈ కారు రేస్ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) చేసిందని, వాళ్ళను ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదన్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో ఎఫ్ఈఓ ను నిందితుడిగా చేర్చవచ్చు కదా అని అన్నారు.
ఇక, కేటీఆర్ లబ్ధి పొందినట్టు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది దవే వాదించారు. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ని బాధ్యుడిని చేస్తూ వాదనలు చేశారు. ఆ తరహా మూడు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెక్షన్ 405, 409 ఏమాత్రం చెల్లవని, ఈ – రేస్‌ను కొనసాగించాలన్న ఉద్దేశంతో నిధుల చెల్లింపులు జరిగాయి తప్ప అవినీతి లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పులను దవే చదివి వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం కేటీఆర్ తరపున న్యాయవాది దవే వాదనలు ముగించారు. కోర్టుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ, ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించనున్నారు.