Friday, January 10, 2025

ఫార్ములా కేసులో ముగిసిన కెటిఆర్‌ ‌విచారణ

ఆరున్నర గంటలపాటు విచారించిన అధికారులు
నిధుల మళ్లింపుపై ముగ్గురు అధికారుల ఆరా
విచారణ సమయంలో హాజరైన అడ్వకేట్‌ ‌రామచంద్రరావు
రేవంత్‌ ‌ప్రశ్నలనే ఎసిబి అడిగిందన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  కెటిఆర్‌

ఫార్ములా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌కేసులో  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌గురువారం ఏసీబీ  విచారణకు హాజరు కాగా..దాదాపు ఆరున్నర గంటలపాటు ఎసిబి అధికారులు చేసిన విచారణ ముగిసింది. ఫార్ములా కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్‌ను విచారించేం దుకు ఏసీబీ అధికారులు ఆయనను నడిపించి విచారణ కోసం తీసుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్‌ ‌ఖాన్‌.. ‌కేటీఆర్‌ను విచారించారు. ఈ విచారణను జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌రితిరాజ్‌ ‌పర్యవేక్షించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్‌ ‌న్యాయవాది రామచంద్రరావును అనుమతించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఫార్ములా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌కేసులో పెద్ద మొత్తంలో నిధుల చెలామణీ, అన్యాయంగా ఆర్థిక లావాదేవీలు జరగడం వివాదంగా మారింది. ఈ వివాదంలో కేటీఆర్‌ ‌ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా రావాలని ఏసీబీ తెల‌పగా, కేటీఆర్ ‌వొస్తానని చెప్పారు. కేటీఆర్‌కు ఈ కేసులో అనేక ఆరోపణలు వొచ్చాయి, అవి నిరూపించడానికి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఈ కేసు చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అరవింద్‌ ‌కుమార్‌, ‌దానకిశోర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈ విచారణ జరగింది. ఫార్ములా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌ప్రాజెక్టులో నియమాలను ఉల్లంఘించి రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ అంశంపై ఏసీబీ కేటీఆర్‌ను విచారించింది. అయితే కేటీఆర్‌ ‌విచారణ సందర్భంగా న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం కేటీఆర్‌ ‌విచారణను అనుసరించి, న్యాయవాది లైబ్రరీలో కూర్చోవడం ద్వారా ఏసీబీ చర్యలు తీసుకుంది. కేటీఆర్‌-‌న్యాయవాది సంభాషణలకు విజిబుల్‌ ‌డిస్టెన్స్‌లో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విచారణ తర్వాత కేటీఆర్‌ ‌స్టేట్‌మెంట్‌ను రికార్డ్ ‌చేసేందుకు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఆఫీస్‌లో విచారించారు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొనడం, స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చేయడం తదితర చర్యలు తీసుకున్నాయి. దీంతో ఈ కేసు విషయంలో తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని రాజకీయ వర్గాలతో పాటు అనేక మంది ఆసక్తితో ఉన్నారు.

నాలుగు ప్ర‌శ్న‌ల‌నే 40 ర‌కాలుగా అడిగారు..
ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ ‌మీడియాతో మాట్లాడారు. ాపూర్తి స్థాయిలో ఏసీబీ విచారణకు సహకరించా. నాకున్న అవగాహన మేరకు ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా. విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్ని సార్లు పిలిచినా వొచ్చి సహకరిస్తానని చెప్పాను. మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇది ఒక చెత్త కేసు. రాజకీయ ఒత్తిడితో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకే తెలియడం లేదు, పూర్తిగా అసంబద్ధమైన కేసు అని అధికారులకు చెప్పాను. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు.. కొత్తగా అడిగిందేమీ లేదు. పైసలు పంపానని నేనే చెబుతున్నాను.. డబ్బులు వొచ్చాయని వాళ్ళు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని అడిగాా అని కేటీఆర్‌ ‌తెలిపారు.

కేటీఆర్ ‌మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ విజయ్‌కుమార్‌ అభ్యంతరం తెలిపారు. మీడియాతో మాట్లాడితే భయమెందుకని కేటీఆర్‌.. ‌డీసీపీని ప్రశ్నించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని, ఇక్కడ మీడియా సమావేశం పెట్టవద్దని సూచించారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్‌‌మీట్‌ ‌పెట్టుకోవాలన్నారు. బీడియా ప్రతినిధులను పోలీసులు తోసేయడంతో… కేటీఆర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పలు రకాల ప్రశ్నలనే 40 విధాలుగా అడిగారని కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను చెప్పాల్సినది చెప్పినట్లు కేటీఆర్‌ ‌తెలిపారు. అంతేకాదు ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, రేవంత్‌ ‌చెప్పిన ప్రశ్నలనే అధికారులు అడిగారని కేటీఆర్‌ అన్నారు. మరోవైపు కేటీఆర్‌ ‌విచారణ నేపథ్యంలో అరెస్ట్ అవుతారా అని బీఆర్‌ఎస్‌ ‌వర్గాలు భయాందోళన చెందాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com