Tuesday, December 24, 2024

అధికారులపై జరిగిన దాడి కేసులో కెటిఆర్ ప్రధాన సూత్రధారి

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై జరిగిన దాడి కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆరే ప్రధాన సూత్రధారి అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సిఎల్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి ఖలిస్తాన్ తీవ్రవాదులు ఎంత ప్రమాదకరమో తెలంగాణకు కెసిఆర్ కుటుంబం అంతే ప్రమాదకరమని ఆయన ఫైర్ అయ్యారు. అదేవిధంగా కశ్మీర్ తీవ్రవాదులు ఎంత డేంజరో బిఆర్‌ఎస్ పార్టీ కూడా అంతే డేంజరని ఆయన ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం పక్కా అని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం పతనం ఖాయమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com