Friday, January 17, 2025

చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను.. కేటీఆర్‌

  •  కక్ష సాధింపుతోనే ప్రభుత్వం నాపై అక్రమ కేసు
  • ఈడీ విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్‌

రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. అక్రమ కేసులో విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి తాను ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరయ్యానని, ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యానని తెలిపారు. రెండు సంస్థలు   కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు గంటల పాటు అడిగి వివరాలు తీసుకున్నాయని అన్నారు. ఫార్ములా ఈకార్‌ రేసు లో  ఈడీ విచారణ తర్వాత మీడి యాతో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ రెండు సంస్థలకు ఒక్కటే మాట చెప్పానని, మీరు ఎన్నిసార్లు పిలిచినా వొచ్చి సమా ధానం చెబుతానని,  పూర్తిగా విచారణకు సహకరిస్తానని అన్నారు. ఈ విచారణకు 10 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అసలు అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృథా చేయడం ఎందుకు? ఆ పైసలతోని రైతు రుణమాఫీ చేయొచ్చు.. ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. అందుకే సంక్రాంతి పండగ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి నేను ఒక ఆఫర్‌ ఇస్తున్నాను.

హైకోర్టు న్యాయమూర్తి కాని, ఇంకా ఏవరైనా న్యాయమూర్తి ముందు మీడియా సాక్షిగా లైవ్‌ డిబెట్‌కు పోదాం. రేవంత్‌ రెడ్డి ప్యాలెస్‌లో అయినా ఈడీ ఆఫీస్‌లో అయి నా, న్యాయమూర్తి ముందు అయినా లై డిటెక్టర్‌ పరీక్షకు నేను రెడీ. దొంగెవరో.. దొరెవరో.. ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. అనికేటీఆర్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డికి ధైర్యం ఉంటే తనతో పాటు లై డిటెక్టర్‌ పరీక్షకు రావాలని, ఫార్ములా ఈ కార్‌ రేసు, వోటుకు నోటు కేసులకు సంబంధించి రేవంత్‌ ను, నన్ను ప్రశ్నలు అడగండి. నేను సమాధానం చెప్తాను. ఆయన కూడా జవాబు చెప్పాలని సవాల్‌ విసిరారు. తేదీ, సమయం రేవంత్‌ రెడ్డే నిర్ణయించాలని, ఇలా అయితే ఓ యాభై లక్షల్లో మొత్తం నిజం తెలుస్తుందని అన్నారు.

వోటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీకి రేవంత్‌ రెడ్డి దొరికిండు కాబట్టే తనపై కూడా ఏసీబీ కేసు పెట్టించాడని, రేవంత్‌ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టే నా మీద ఈ ఈడీ విచారణ జరిపిస్తున్నారని మండిపడ్డారు. అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుంది. హైకోర్టు. సుప్రీంకోర్టు. భారత న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కాకుండా ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది. ఇక్కడికి వొచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు. 8 గంటలు వాళ్ళ ఇదే అడిగారు నేను ఇదే చెప్పారు తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీ.. పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది ఇంకెక్కడ మనీ లాండరింగ్‌ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగాను.  ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. అన్నింటికి సమాధానాలు ఇచ్చాను అని కేటీఆర్‌  మీడియాకు వెల్లడిరచారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com