Friday, February 28, 2025

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల జూన్ 20న ‘కుబేర’

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ ‘కుబేర’ మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. కుబేర జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ లతో కూడిన అద్భుతమైన తారాగణంతో కుబేర భారతీయ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలుస్తుందని హామీ ఇస్తోంది.

kubera movie atest updates

క్యారెక్టర్ బేస్డ్ నరేటివ్స్ తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ గా తీర్చిదిద్దారు, ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రిలీజ్ డేట్ పోస్టర్ నాగార్జున, ధనుష్‌లను ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేసింది, జిమ్ సర్భ్ బ్యాక్ డ్రాప్ లో నిలబడి ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ అద్భుతమైన స్పందన తో అంచనాలను పెంచింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌విసిఎల్‌ఎల్‌పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com