Saturday, December 28, 2024

కుల‌గ‌ణ‌న త‌ర్వాత కేంద్రంతో యుద్ద‌మే

దేశానికి మ‌న లెక్క‌లు మోడ‌ల్ గా ఉండాలి
న‌వంబ‌ర్ 31లో గ‌ణ‌న చేసి తీరుతాం
ఇదో మెగా హెల్త్ చెక‌ప్‌
సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ నుంచే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై యుద్దం ప్ర‌క‌టించాల‌ని, దేశానికి తెలంగాణ రోల్ మోడ‌ల్‌గా నిలిచే ప్రాజెక్టులు చేప‌ట్టుతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన బుధవారం కులగణన సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కుల గ‌ణ‌న అనేది దేశానికి ఒక మోడల్ గా మారాలని, ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ మోడల్ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందన్నారు. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని, తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటిస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో చేస్తున్న కులగణన ఎక్స్ రే మాత్రమే కాదని, ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది అని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం అని, భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామ‌న్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించామ‌ని, రాజకీయ మనుగడ కోసం కొంతమంది అడ్డంకులు సృష్టించినా 10నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామ‌ని సీఎం వెల్ల‌డించారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని, సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియమ్మ సఫలీకృతం అయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నెరవేర్చారన్నారు.

అన్నింటికీ ఉప‌యోగం
సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అమలు చేస్తోందని భట్టి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కులగణనపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అమలు చేస్తోందన్నారు. కులగణనతో వెనకబడిన వర్గాలకు ఏం చేయవచ్చనే అంశంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాలలో త్వరలోనే డీసీసీ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెల 5న రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని.. రాహుల్ గాంధీతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశం మొత్తానికి తెలంగాణ కులగణన ఎక్స్ రేలా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

 

కులగణనకు సహకరించండి: పొన్నం
దేశంలో తొలిసారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాటు సిద్ధమయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 6 నుంచి కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. సర్వేకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించాలని చెప్పారు. అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.

లేదంటే మీ పార్టీ కనుమరుగే: కోమటిరెడ్డి
కులగణన చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేసిన విమర్శలు చేయడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందన్నారు. 50 శాతం పై బడిన బీసీ వర్గాలకు మేలు జరుగబోతోందన్నారు. ‘‘దీపావళికి దావత్ చేసుకుంటే తప్పేంది అంటున్నాడు. మీరు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం. చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించాం. వెనుకబడిన కులాల మీద వాళ్లకు ప్రేమ లేదు. ఫ్లోర్ లీడర్ నువ్వే ఉంటావ్. మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనండి సహకరించండి. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి ప్రెస్‌నోట్ అయినా విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగవుతుంది’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com