Sunday, December 29, 2024

కూల్చడంలో తగ్గేదేలే

అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరింత దూకుడు – కమిషనర్‌ రంగనాథ్‌

అక్రమ నిర్మాణాల తొలగింపులో హై డ్రా కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం హైడ్రా అన్యువల్‌ రిపోర్ట్‌ విడుదల చేసిన కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడామన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో హైడ్రా మరింత దూకుడు పెంచుతుందని, కూల్చివేతలు ఆగలేదు.. ఇంకా ఉంటాయని స్పష్టంచేశారు. చెరువుల హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతోందని అన్నారు. స్పష్టత రాగానే హైడ్రా యాక్టివ్‌గా ఉంటుందని తెలిపారు. భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని తేల్చిచెప్పారు. అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించామని తెలిపారు.

ఆవిర్భావం నుంచి..!
2024 జూలై 19వ తేదీన హైడ్రా ఆవిర్భవించిందని రంగనాథ్‌ చెప్పారు. హైడ్రా 5 నెలల పని తీరు, వచ్చే ఏడాది కార్యాచరణను ప్రకటిస్తున్నామని ఓఆర్‌ఆర్‌ లోపల.. 2050 కిలోమీటర్ల పరిధి.. తెలంగాణలో 33 శాతం హైడ్రా పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల భూమిని కాపాడిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడామని అన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా 1025 చెరువుల హద్దులను ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ చెప్పారు. హైదరాబాద్‌లో హైడ్రా సమాచారం చేరవేయడం కోసం ఓఎఫ్‌ఎం రేడియో ప్రారంభిస్తామని తెలిపారు. జూలై 19వ తేదీకు ముందు తర్వాత అక్రమ కట్టడాలను శాటిలైట్ ఇమేజ్ ద్వారా గుర్తిస్తున్నామని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే హైడ్రా పని కాదని.. 12 చెరువులను పునరుద్దరణ చేస్తున్నామని చెప్పారు. డీఆర్ఎఫ్‌లో 72 టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ వరకు డీఆర్ఎఫ్ పని చేస్తుందన్నారు. కొంత మంది హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. దానిని ఖండిస్తున్నామని రంగనాథ్ అన్నారు.

ఎఫ్‌టీఎల్ నిర్దారణ..
హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని, ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశామని, ఓఆర్‌ఆర్‌ వరకు హైడ్రా పరిధి ఉందని, జీహెచ్ఎంసీ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను కేటాయించిందని వివరించారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని, 12 చెరువులు, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా హైడ్రా కాపాడిందని, 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తామని, ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత అని, శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామని, 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్‌తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్‌టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నామన్నారు. ఎఫ్‌టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుందని, శాస్త్రీయమైన పద్ధతుల్లోనే ఎఫ్‌టీఎల్ నిర్దారణ జరుగుతుందని, నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నామని, 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయన్నారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని రంగనాథ్ పేర్కొన్నారు.
‘‘27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తాం. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి. నాగోల్‌లో ఉన్న డీఆర్ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుంది. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం. హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్‌కు ప్రయత్నిస్తున్నాం. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుంది. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుంది. జూలై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం’’ అని రంగనాథ్ వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com