– ప్రమాదం లోపల ఐదుగురు కూలీలు
శ్రీశైలంలోని లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఐదారుగురు కూలీలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ను తవ్వుతూ దానికి ప్యారలాల్‌గా లైనింగ్ పనులు చేస్తుంటారు. టన్నెల్ బోరింగ్ మిషన్ రిపేర్ల కారణంగా కొన్నాళ్లుగా పనులు చేయడం లేదు. మూడు మీటర్ల మేరకు పై కప్పు కుంగిందని తెలిసింది. ఒక్కసారి కుప్ప కూలడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఎస్‌ఎల్‌బీసీ ఎడమ వైపు టన్నెల్ 14వ కి.మీ.ల వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయిందని చెప్తున్నారు. సిమెంట్ లైనింగ్ చేసిన భాగం ఎలా కూలిందనే వివరాలు తెలియాల్సి ఉంది.