Tuesday, December 24, 2024

కూర్చున్న వారి మీదకు లారీ

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రారం గ్రామానికి చెందిన కొందరు దర్గా దగ్గర కూర్చుకున్నారు. ఈ సమయంలో డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయ ఎర్రారం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దేవరకొండలోని ఓ దర్గా దగ్గర కూర్చుకున్నారు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలనుపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం చోటుచేసుకుందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఒకేసారి మరణించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com