Thursday, May 2, 2024

జితేందర్ రెడ్డి నుండి “లచ్చిమక్క” లిరికల్ సాంగ్

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. రీసెంట్ గానే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది, ముఖ్యంగా యువతకి ఆ పాట బాగా నచ్చింది. ఆ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా ఇప్పుడు విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980′ లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాట్యురల్ గా ఉన్నాయి. ఈ పాత ద్వార కథలో ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular