Wednesday, January 8, 2025

లేడీ సూపర్‌స్టార్‌కి నోటీసులు

లేడీ సూపర్‌స్టార్‌ నయనతారకి నోటీసులు అందినట్లు సమాచారం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… నయనతార జీవితంపై ”నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌” అనే డాక్యుమెంటరీ రూపొందిన సంగతి తెలి సిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీ చుట్టూ అనేక వివాదాలు తలెత్తాయి. అందుకే రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత డైలీ ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో ‘చంద్రముఖి’ నిర్మాతలు నయన్ దంపతులకు లీగల్ నోటీసులు పంపినట్లుగా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. టాలెంటెడ్ బ్యూటీ ‘చంద్రముఖి’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించడంపై మేకర్స్ అభ్యంతరం తెలిపినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందుకుగాను నయన్ దంపతులు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీపై రూ. 5 కోట్ల దావాను నిర్మాతలు వేసినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చంద్రముఖి సినీ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ స్పందిస్తూ.. నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టంచేశారు. నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ముందే ఎన్ఓసీ తీసుకున్నారని, తాము రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఈ మేరకు నవంబర్ నెలలో జారీ చేసిన ఎన్ఓసీ లెటర్ ను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.”నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ డాక్యుమెంటరీ రూపొందించే ముందే ‘రౌడీ పిక్చర్స్’ సంస్థ మా వద్ద నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) తీసుకుంది. డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని ఫుటేజీ ఉపయోగించడంపై మేము ఎలాంటి నోటీసులు పంపలేదు. మొత్తం 17 సెకన్ల వీడియో క్లిప్పింగ్స్ వాడుకోవడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది. అలానే నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారని ప్రచారంలో ఉన్న వార్తలను నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. దీంతో నయనతారపై రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు బ్రేక్ పడినట్లయింది.

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com