Friday, January 31, 2025

మీ పోరాటానికి అండగా ఉంటాం

వికారాబాద్‌ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ని తెలంగాణ భవన్లో కలిసి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తనను కలిసిన ఫార్మా సిటీ భూ సేకరణ బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్‌ వారికి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజన భూసేకరణ బాధితులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పోలీసుల ద్వారా బాధిత కుటుంబాలను వేధించడం మానుకోవాలన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం తగదన్నారు.

వికారాబాద్‌ జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసిన మాట్లాడిన కేటీఆర్‌, బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసు వేధింపులను నిలిపివేయాలని కోరారు.అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల భూ సేకరణ బాధితుల డిమాండ్లను లేవనెత్తుతామని కేటీఆర్‌ తెలిపారు. భూముల కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న బాధితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. గిరిజనులు, పేద రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్‌ బాధితుల తరఫున నిలబడుతుందని స్పష్టం చేశారు. లగచర్ల బాధితులు చేసిన పోరాటంకు తలవంచి ప్రభుత్వం దిగి వచ్చిందని, నోటిఫికేషన్‌ రద్దు చేసుకుందన్నారు. కానీ మరోసారి అవే భూములను పారిశ్రామిక కారిడార్‌  పేరుతో సేకరించడం మానుకోవాలని, నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజల అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఇకనైనా నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజన భూములను వదిలి, సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబానికి చెందిన వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరించి ఫార్మా పరిశ్రమల కోసం ఉపయోగించాలని కేటీఆర్‌ సూచించారు.

గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దుర్మార్గానికి నిదర్శనమని మండిపడ్డారు. జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి వంటి వారి తరపున, అక్రమంగా కేసులతో జైల్లో ఉన్న బాధితుల తరఫున, న్యాయపోరాటానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూముల సేకరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో లగచర్లకు వచ్చిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులపై ప్లాన్‌ ప్రకారం దాడి జరిగింది. వారి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని, మరికొందర్ని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. రైతులు ధర్నాలు, ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఫార్మా సిటీ నోటిఫికేషన్‌ రద్దు చేసింది. అక్కడ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ వస్తుందని, ఫార్మా సిటీ కాదని మరో కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడంతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com