Wednesday, December 25, 2024

లక్షల కోట్ల అప్పులు దుబారా చేశారు..

గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి  నానా తంటాలు పడుతున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇందిరమ్మ రాజ్యం వొచ్చేంత వరకు రాష్ట్రంలో జరిగిన అప్పులు, ఖర్చులు, అలాగే తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తరువాత దానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నివరిస్తూ 2023లో శ్వేతపత్రాన్ని ఈ సభలో పెట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆ పత్రంలో చాలా స్పష్టంగా ఏ విషయాన్ని కూడా దాయకుండా సాధ్యమైనంత వరకూ మాకున్నటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర రుణ భారాన్ని రూ.6,71,757 కోట్లుగా నిర్ధారించి స్పష్టంగా సభ ముందు ఉంచామని తెలిపారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన మార్కెట్‌ రుణాలు రూ.3,89,673 కోట్లకు సంబంధించి వివరాలను పేర్కొన్నాం.  వివరించాం. అలాగే  ఎస్‌పివిస్‌ కార్పొరేషన్‌ ఒక గ్యారెంటీనిచ్చి చెల్లించే రుణాలకు సంబంధించిన సమాచారం కూడా రూ.1,27,208 కోట్లుగా శ్వేత పత్రంలో పొందుపరిచాం. గ్యారెంటీ లేకుండా వివిధ కార్పొరేషన్‌ తీసుకున్న రుణాలు రూ.59,414 కోట్లు, మొత్తంగా రూ.6,71,757 కోట్లుగా ఆ శ్వేత సత్రంలో స్పష్టంగా పేర్కొన్నామని వివరిచాం.

మేం  ఇచ్చిన సమాచారం తప్పని చెప్పి బిఆర్‌ఎస్‌ నేతలు  చెబుతూ కొన్ని ఆర్బిఐ రిపోర్ట్‌ లు తీసుకొని వొచ్చి చూపిస్తున్నారు. ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంది. ఎందుకంటే, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఆలోచనతోనే ‘రాష్ట్ర రుణాలు- స్వల్ప వ్యవధి’ చర్చ మొదలుపెట్టాం. శ్వేత పత్రంలో ఏం చూపించామనేదారిపై వివరిస్తున్నాం. శ్వేత పత్రంలో పేజీ నెం.20, టేబుల్‌ నెం.9 లో మేం ఇచ్చిన నోట్‌ ప్రకారమే ఎఫ్‌ఆర్‌బిఎం లోన్‌ రూ.3,89,673 కోట్లు, గవర్నమెంట్‌ గారెండెడ్‌ లోన్స్‌ రూ . 1,27,208 కోట్లు వాస్తవంగా మేం ఆ రోజు ఉన్న అప్పులు చూపించింది, రూ.6,71,157 కోట్లు.. వాస్తవానికి దీనికంటే ఇంకా ఎక్కువుంది. దానిని కూడా పెండిరగ్‌ బిల్స్‌ సంబంధించి పేజ్‌ నెం, 30లో చూపించాం. దాంట్లో పెండిరగ్‌  బిల్స్‌ రూ.40,154 కోట్లుంది. ఈ తెచ్చిన అప్పులు కాకుండా ప్రజలకు, కార్పొరేషన్లకు మిగతా వాటికి, మిగతా సంస్థలకి, ఉద్యోగస్తులకు, చిన్న చిన్న కాంట్రాక్టులకు, మిగతా చిన్న చిన్న ఉద్యోగస్తులకు కావలసినటువంటి పెన్షన్స్‌, ప్రావిడంట్‌ ఫండ్స్‌, లాస్ట్‌ టైం మెస్‌ బిల్స్‌ , అన్నింటికీ కలిసి రూ.40 వేల కోట్లు అప్పులు పెట్టి పోయారు. అప్పు కూడా ప్రభుత్వం కట్టాల్సింది. ఇవి కలిపితే రూ.7,11,911 కోట్ల అప్పు  పేరుకుపోయిందని భట్టి విక్రమార్క  తెలిపారు.

తమ ప్రభుత్వం ఏడాది నుంచి లక్ష కోట్ల పైగా అప్పు చేసిందని బిఆర్‌ ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం లోన్స్‌ మేము తీసుకున్నది రూ.52118 కోట్లు. మేము ప్రిన్సిపల్‌ అమౌంట్‌ కట్టింది రూ.17,019, వడ్డీ కట్టింది. రూ.26,298 కోట్లు అని వివరించారు.  అప్పు రీపేమెంట్‌ కట్టినది వాస్తవమని తెలిపారు. .దీనిలో రూ.2,823 కోట్లు తీసుకువస్తే, ప్రిన్సిపల్‌ అమౌంట్‌ కు సంబంధించి రూ.10,821 కోట్లు కట్టాం. కేవలం తీసుకువచ్చింది రూ.2,823 కోట్లు మాత్రమే.. అలాగే వడ్డీ రూ.9,668 కోట్లు చెల్లించామని తెలిపారు. 40 వేల కోట్ల రూపాయల పెండిరగు బిల్లులు పెట్టిపోతే రూ.12 వేల కోట్ల రూపాయల బిల్లు క్లియరు చేసి ఆ 44 వేల కోట్లను 22 వేల కోట్లకు కుదించాం. అంటే అక్కడ రూ.12 వేల కోట్లు  ఇక్కడ రూ.15 వేల కోట్లు అంటే దాదాపు 24 వేల కోట్ల పైబడి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలకు  ఉద్యోగస్తులకు మొదటి నెల ఇచ్చే జీతంతో పథకాలు ఇవన్నీ కాకుండా మీరు చేసిన అప్పులకు సంబంధించిన భారం మోస్తూ ఆ అప్పుల భారాన్ని  తీర్చింది రూ.24 వేల కోట్లపైనే అని వివరించారు.

మార్చి నెల నుంచి ఒకటవ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ 3లక్షల 69 వేల 200 నుంది రెగ్యులర్‌ ఉద్యోగులకు 2 లక్షల 86 వేల పెన్షనర్లకి  తమ ప్రభుత్వం వొచ్చిన వేతనాలు జమచేస్తున్నాం. అలాగే రైతు భరోసాకి రూ.7,628 కోట్లు,  రైతు రుణమాఫీకి రూ. 20,615 కోట్లు వేశాం. వాళ్లు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి 2014 నుంచి 2018 వరకు నాలుగు దఫాలుగా ఇస్తే ఆ ఇన్‌స్టాల్మెంట్ల ద్వారా పెరిగిన వడ్డీ చూస్తే ఆ వడ్డీకే వాల్లిచ్చిన డబ్బులు సరిపోయాయి తప్ప అసలు అలాగే ఉండిపోయింది. 2018 నుంచి 2023 వరకు మళ్లీ  లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి. నాలుగేళ్లుగా చేయకుండా చివరి సంవత్సరంలో అరకొరగా ఇచ్చి గాలికి వదిలేశారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు. తాము అధికారంలోని రాగానే రెండు లక్షలు ఉన్న వారందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే రూ.20 వేల కోట్ల మేర నిధులను  మంజూరు చేశామని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com