లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనున్న ఈ ఓటింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఓటేసేందుకు తరలివస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆమ్ ఆద్మీపార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బీజేపీ మండి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కంగనా రనౌత్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్‌లోగల గోరఖ్‌నాథ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పంజాబ్ రాష్ట్రం ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం పరిధిలోని సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ లఖ్‌నౌర్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ సైతం పంజాబ్‌లోని జలంధర్‌లో ఓటేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని సూచించారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రి దేవి, కుమార్తె సరన్ లోక్‌సభ అభ్యర్థి రోహిణి ఆచార్య సహా పలువురు ఈ దశలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3 స్థానాలతో పాటు చండీగఢ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 42 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగుతున్నాయి. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి.
ఈ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో అత్యధికంగా పంజాబ్‌లో 328 మంది, ఉత్తరప్రదేశ్‌లో 144 మంది, బీహార్ 134, ఒడిశా 44, జార్ఖండ్ 52, హిమాచల్‌ప్రదేశ్ 37, చండీగఢ్‌లో 19 చొప్పున బరిలో ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో మూడు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.