గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ నోయిడాలోని సెక్టార్ 44లో ఉన్న తన లగ్జరీ ప్రాజెక్ట్ గోద్రేజ్ రివరైన్ ప్రారంభోత్సవంలో రూ. 2,000 కోట్లకు పైగా విలువైన 275 ఇళ్లను విక్రయించినట్లు మంగళవారం ప్రకటించింది. గత నెలలో నొయిడాలోని సెక్టార్ 44లో ప్రారంభించిన గోద్రేజ్ రివరైన్ ప్రాజెక్టును సుమారు 6.46 ఎకరాల్లో అభివృద్ధి చేస్తోంది. ఇలా వరుసగా మూడుసార్లు రెండు వేల కోట్లకు పైగా అమ్మకాలు సాధించిన సంస్థగా గోద్రెజ్‌రికార్డును సృష్టించింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ గతంలో Q1 FY25లో గోద్రేజ్ జార్డినియా, సెక్టార్ 146 నోయిడాలో మరియు Q2 FY24లో గోద్రేజ్ ట్రాపికల్ ఐల్, సెక్టార్ 146, నోయిడాలో INR 2,000 కోట్లకు పైగా ఇన్వెంటరీని విక్రయించింది.