Wednesday, January 8, 2025

లావణ్య త్రిపాఠీ “మిస్ పర్ఫెక్ట్”

లాస్ట్ ఇయర్ “అతిథి”, “దయా”, “వధువు” వంటి ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు అందించిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్..కొత్త ఏడాదిలో “మిస్ పర్ఫెక్ట్” అనే మరో సరికొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రతి పని పర్ఫెక్ట్ గాచేసే మిస్టర్ పర్పెక్ట్ ల గురించి మాట్లాడుకుంటుంటాం…కానీ ఇక్కడ మిస్ పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసింది, చేయించింది అనేది ఈ వెబ్ సిరీస్ లో హిలేరియస్ గా చూపించబోతున్నారు దర్శకుడు విశ్వక్ ఖండేరావ్.

లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. మిస్ పర్ఫెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీ స్పందిస్తూ ‘న్యూ ఇయర్ ను పర్ఫెక్ట్ గా మొదలుపెట్టబోతున్నాం…’ అంటూ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ – “మిస్ పర్ఫెక్ట్” లాంటి ఒక యూనిక్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన జీవితాల్లో అనుకోకుండా ఏర్పర్చుకునే కొన్ని కనెక్షన్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనే కథతో ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీగా “మిస్ పర్ఫెక్ట్” ను రూపొందించాం. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సిరీస్ తో కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com