లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)Layout Regularization Scheme (LRS) అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై సచివాయలంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ విధి విధానాల కసరత్తుపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు. జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల, శాఖల ముఖ్యకార్యదర్శులు నవీన్ మిత్తల్, జ్యోతి బుద్ధ ప్రకాష్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.