Thursday, January 30, 2025

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ దోహ్రులు

  • స్వాతంత్య్రం కోసం ఎలాంటి పోరాటం చేయలేదు
  • మల్లికార్జున ఖర్గే సంచనల వ్యాఖ్యలు

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ ద్రోహులు, స్వాతంత్య్రం కోసం వారు ఎటువంటి పోరాటం చేయలేదని’ కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. పేదరికం, నిరుద్యోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్లోని మహులో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్‌, ‌జై సంవిధాన్‌’ ‌ర్యాలీలో ఈ మేరకు ఖర్గే వ్యాఖ్యలు చేశారు.

‘మతం పేరుతో పేదలను దోపిడీ చేయడాన్ని కాంగ్రెస్‌ ఎన్నటికీ సహించదు. కెమెరాల కోసం పవిత్ర గంగా నదిలో స్నానం చేసేందుకు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. మహా కుంభమేలాలో స్నానం చేయడం వల్ల పేదరికం అంతమవుతుందా?  నేను ఎవరి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రశ్నించడం లేదు. ప్రధాని మోదీ చేసే తప్పుడు వాగ్దానాల వలలో ప్రజలు పడకూడదనే చెబుతున్నా. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం ఐక్యంగా ఉండాలి’ అని ప్రజలను ఖర్గే కోరారు.

మరోవైపు ఇదే ర్యాలీలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ విమర్శల వర్షం కురిపించారు. పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా, కేవలం ధనికులకు మాత్రమే అన్ని హక్కులను కలిగి ఉండే స్వాతంత్య్రానికి ముందునాటి పరిస్థితులను తిరిగి స్థాపించేందుకు బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను దూరం చేసి దళిత, బీసీ, గిరిజన వర్గాలను మరోసారి బానిసలుగా మార్చాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు.

దేశ సంపదను కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులకే అప్పగించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌యోచిస్తున్నాయని రాహుల్‌గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను మోదీ సర్కార్‌ అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే 50శాతం రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం సహా కులగణన చేపడతామన్న రాహుల్‌, ‌కేవలం కొందరికి భయపడి మోదీ క్యాస్ట్ ‌సెన్సస్‌ను చేపట్టడం లేదని ఆరోపించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com