ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా సుశీల అనారోగ్యంతో బాధపడుతున్నారు. . ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. సుశీలకు ప్రస్తుతం 86 ఏళ్లు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అతికొద్ది మందిలో సుశీల ఒకరు. ఆమె లెక్కలేనన్ని పాటలు పాడి శ్రోతలను అలరించారు. . భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు అవార్డుని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2008లో పద్మ భూషణ్‌ను అందుకున్నారు. పి సుశీల త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.