Wednesday, December 25, 2024

లెక్క తప్పిందా సుక్కూ?

లెక్కల మాస్టర్.. లెక్క తప్పిందేంటి అబ్బా అంటే తప్పిందనే చెప్పాలి. ఇంతకీ లెక్కల మాస్టర్‌ ఎవరా అనుకుంటున్నారా ఆయనేనండీ డైరెక్టర్ సుకుమార్.. రచయితగా ఎంట్రీ ఇచ్చిన సుక్కూ మాస్టర్.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారారు. పుష్ప సిరీస్ చిత్రాల తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా అవతరించారు. వేరే లెవెల్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. సుకుమార్.. అంటే ఓ బ్రాండ్ అని ప్రూవ్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తో ఆర్య సినిమా చేసి డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చిన సుకుమార్.. తన ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పటి వరకు ఎవరూ తీయని విధంగా లవ్ స్టోరీ తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. తన టేకింగ్ రూటే వేరు అన్నట్లు మెప్పించారు. రెండో సినిమా రామ్ పోతినేనితో జగడం చేశారు. విభిన్నమైన మూవీగా వచ్చిన ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే మూవీ తీయగా.. కొందరు మాస్టర్ పీస్ అంటే.. మరికొందరు అర్థం కాలేదని ఆరోపించారు. కానీ హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో ఆ సినిమా తీశారనే చెప్పాలి. ఆ తర్వాత ఆర్య-2తో క్యారెక్టరైజేషన్ ఆధారంగా భావోద్వేగాలను నడిపించే డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. 100% లవ్, నాన్నకు ప్రేమతో చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు. రామ్ చరణ్ తో రంగస్థలం మూవీ చేయగా.. ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపించారు. కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిన ఆ సినిమాతో వేరే లెవెల్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పుష్పతో ఆయన రేంజే మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్ లో హిట్ సొంతం చేసుకున్న ఆయన.. అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఎవరికీ దక్కని నేషనల్ అవార్డ్ దక్కేలా చేశారు. ఇక రీసెంట్ గా పుష్ప-2తో ప్రభంజనం సృష్టించారు. మూడేళ్లపాటు కష్టపడ్డ ఆయన.. అందుకు తగ్గ ప్రతిఫలం అందుకున్నారు. రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు. సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు దాటినా.. ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. మూవీలో ప్రతీ సీన్ ను చెక్కే సుకుమార్.. నెక్స్‌ట్‌ చరణ్ తో రెండో సారి వర్క్ చేయనున్నారు. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ పై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. అదే సమయంలో ఆయన రీసెంట్ గా కామెంట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో తాను సినిమాలు వదిలేస్తానని చెప్పడంతో అంతా షాక్ అయిపోతున్నారు. అసలు సుక్కూ మూవీస్ వదిలేయడమేంటని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.

రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా యూఎస్ లో జరగ్గా.. సుకుమార్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ సమయంలో సుకుమార్ గారు.. డోప్ అని చెప్పి వదిలేయాలంటే దేన్ని వదిలేస్తారని యాంకర్ సుమ ప్రశ్నించారు. దీంతో ఆయన సినిమా అని ఆన్సర్ ఇచ్చారు. దీంతో అక్కడే ఉన్న రామ్ చరణ్ సహా అంతా షాకయ్యారు. నిజానికి డోప్ అంటే వదిలిపెట్టడం అని మీనింగ్ అంట. మరి సుకుమార్ అలా ఎందుకు చెప్పారో తెలియదు కానీ.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సుకుమార్‌ ఆ మాట అనడానికి కారణం ఏమిటబ్బా..పుష్ప2 వివాదమే దీనికి కారణమా? అంతేకాక కొంత మంది పుష్పకథని కూడా నెగిటివ్‌ చేసి మాట్లాడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్‌ కథ అని ఓ స్మగ్లర్‌ని గొప్పగా హైప్‌ చేసి చూపించడం ఏమిటని ఇలా రక రకాల వివాదాలు వస్తున్నాయి. దీంతో సుక్కు ఫ్రెస్టేషన్‌ ఫీల్‌ అయి ఆ మాట అన్నారా అన్నది అర్ధం కాక నెటిజన్లు తలబాదుకుంటున్నారనుకోండి.

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com