ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బడా నిర్మాతలు దగ్గర నుంచి హీరోలు, దర్శకులు అంటూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటి వరకు నిర్మాతలు, ఫైనాన్షియర్లపై మాత్రమే ఐటీ దాడులు జరుగగా ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి.
డైరెక్టర్ సుకుమార్‌ను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఇంటికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్, ఆదాయ వివరాలపై ఆరాతీస్తున్నారు. మరి వీటన్నిటికీ సుకుమార్ లెక్కల మాస్టారు లెక్కతేల్చి చెబుతారా లేదా ఏమన్నా గడబిడ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఇకపోతే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలోనూ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.