Tuesday, April 22, 2025

రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడుదాం..

  • ఇది గాంధీ – గాడ్సే పరివార్‌ల మధ్య యుద్ధం
  • రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలుద్దాం
  • ఇండోర్‌లో  ‘‘జై బాపు, జై భీమ్‌, ‌జై సంవిధాన్‌’’ ‌ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మధ్యప్రదేశ్‌ ‌లోని ని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘జై బాపు, జై భీమ్‌, ‌జై సంవిధాన్‌’’ ‌ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగించారు.రాహుల్‌ ‌గాంధీతో కలిసి మనం  పోరాటం చేస్తున్నామని,  ఇది ఎన్నికల ర్యాలీ కాదు.. ఇది ఒక యుద్ధం.. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాం గాన్ని మార్చాలనుకునే వారికి మధ్య జరుగుతోందన్నారు.

ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాం గాన్ని మార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.  రాహుల్‌ ‌గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని,  గజనీ మహమ్మద్‌ ‌హిందుస్థాన్‌ ‌ను దోచుకోవడానికి యత్నించినట్లు.. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ యత్నిస్తున్నారు.. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు.. ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతా పార్టీ పేరుతో చలామణీ అవుతున్న బ్రిటిష్‌ ‌జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్‌ ‌గాంధీ నిలబడ్డారని చెప్పారు.

ఈ యు ద్ధంలో మనమంతా రాహుల్‌ ‌గాంధీతో కలిసి నడవాలని,  రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది రెండు పరివార్‌ ‌ల మధ్య జరుగుతున్న యుద్ధం.  ఒకటి గాంధీ పరివార్‌.. ‌మరొకటి గాడ్సే పరివార్‌.. ‌గాడ్సే పరివార్‌ ‌వైపు నుంచి మోదీ..గాంధీ పరివార్‌ ‌వైపు నుంచి రాహుల్‌ ‌గాంధీ పోరా డుతున్నారు అందుకే మనమంతా గాంధీ పరివార్‌ ‌గా రాహుల్‌ ‌గాంధీకి మద్దతుగా నిలవాలి రాహుల్‌ ‌గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రేవంత్‌ ‌రెడ్డి కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com