Saturday, April 19, 2025

కుప్పం నాదే.. చంద్రబాబుకు రెస్ట్​ ఇద్దాం నారా భువనేశ్వరి వ్యాఖ్యలు

టీఎస్​, న్యూస్​:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్య చేసి హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజాన్ని గెలిపిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబుకు రెస్ట్‌ ఇచ్చి ఈసారి తాను కుప్పం నుంచి పోటీ చేస్తా అని, ఎవరికి చంద్రబాబు కావాలో చేతులెత్తాలని కోరగా అందరు చేతులెత్తారు. మరి నేను అనగా మీరు కూడా కావాలని ప్రజలనుంచి సమాధానం రావడంతో ఇక ఆమె అసలు విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు కావాలా.. నేను కావాలా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే, తర్వాత భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, కేవలం సరదా కోసమేనని అన్నారు. నాకు ఎలాంటి పదవులు వద్దని, చంద్రబాబు నన్ను బాగా చూసుకుంటున్నారని తెలిపారు. నా కంపెనీలో చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఎప్పుడు సీరియస్‌గా మాట్లాడితే బాగోదని, జోక్‌గా అంటున్నానని, సీరియస్‌గా తీసుకోవద్దని, చంద్రబాబే కుప్పంలో ఉంటారని మరోసారి స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com