Saturday, December 28, 2024

అదానీ పెట్టుబడులపై పునరాలోచిస్తాం

అదానీ అయినా అంబానీ అయినా ఒకటే
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు
ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తా
కెటిఆర్‌కు అత్యంత దగ్గరగా ఉండేవారు తమతో టచ్‌లో ఉన్నారు
పార్టీ ఫిరాయింపులపై త్వరలోనే స్పీకర్ అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారు
కాంగ్రెస్‌తో ఎంతమంది టచ్‌లో ఉన్నారన్నది త్వరలోనే తెలుస్తుంది

అదానీ పెట్టుబడులపై పునరాలోచిస్తామని, చట్టానికి లోబడే వ్యాపారాలు చేసే వారిని రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని, అది అదానీ అయినా అంబానీ అయినా ఒకటే రూల్ అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అదానీ అవినీతి నిరూపితమైతే ఆయన పెట్టే పెట్టుబడులను రద్దు చేసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం దావోస్‌లో రూ.45 వేల నుంచి రూ.50 వేల కోట్ల ఒప్పందాలను చేసుకుందని, అందులో సక్రమంగా ఉన్నవాటితోనే తమ ఒప్పందాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అదానీకి ఇప్పటివరకు ఇంచు భూమి కూడా ఇవ్వలేదని స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ఇచ్చారన్నారు. అవి రేవంత్ రెడ్డి సొంత పాకెట్ మనీకోసం ఇవ్వలేదని ప్రజా అవసరాలకు ఇచ్చిన విరాళం అని ఆయన పేర్కొన్నారు. రేపు కెటిఆర్ వచ్చి రూ. 50 కోట్ల విరాళం ఇస్తామంటే స్వీకరిస్తామన్నారు. గతంలో ఈ రాష్ట్రంలో అదానీ కార్యకలాపాలు ఉన్నాయని అప్పుడు అదానీ డబ్బులు వారికి వ్యక్తిగతంగా ముట్టాయా అని ఆయన ఆరోపించారు. చట్టరీత్యా వ్యాపారాలు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎటుంటి అభ్యంతరం లేదన్నారు.

జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టును
ప్రస్తుతం బయటకు వచ్చిన అంశంపై జేపిసి (జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టును Joint Parliamentary Committee Report) కోరుతున్నామన్నారు. జేపిసి ఏర్పాటై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మోడీ ప్రధానిగా తప్పుకోవాల్సి వస్తుందన్నారు. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదన్నారు. అర్హత లేకపోయినా అదానీకి రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత అదానీ ఆస్తులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. ఈ దేశంలో దోపిడీ జరుగుతుంటే మోడీ కల్లు మూసుకున్నారా అని ఆయన నిలదీశారు. మోడీ అండతోనే అదానీ అవినీతి సామ్రాజ్యం నిర్మించారని ఆయన మండిపడ్డారు. అదానీ దాదాపు రూ.2 వేల కోట్ల లంచాలు పంచారని ఆయన ఆరోపించారు. 2014 నుంచి -2024 కేంద్ర లావాదేవీల్లో అదానీ పాత్ర ఉందన్నారు.

బిఆర్‌ఎస్ నాయకులు సుప్రీంకోర్టు పోయినా తమకు న్యాయమే
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని, ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కెటిఆర్‌కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తమ పార్టీలో మరింతమంది బిఆర్‌ఎస్ కీలక నేతలు చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులపై త్వరలోనే స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు సుప్రీంకోర్టు పోయినా తమకు న్యాయమే జరుగుతుందన్నారు. తాము చేసిన మంచి పనులు చూసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో ఎంతమంది టచ్‌లో ఉన్నారన్నది త్వరలోనే తెలుస్తుందన్నారు.

సెబీ చైర్మన్‌ను తొలగించాలి
దేశంలో దొపిడీ జరుగుతుంటే మోడీ కళ్లు మూసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని పిసిసి అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అదానీ ఇష్యూలో సెబీ పూర్తిగా విఫలమైందని సెబీ చైర్మన్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఈడీ, సిబిఐలు ప్రధాని గుప్పెట్లో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 90 శాతం ఏజెన్సీ తనిఖీలు ప్రతిపక్ష నేతలపైనే జరిగాయని ఆయన ఆరోపించారు. బిజెపిపెత్తందారుల పార్టీ కార్పొరేట్ల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com