Sunday, April 20, 2025

తెలంగాణకు న్యాయం చేయాలని ప్రధానికి, ఆర్థికమంత్రికి లేఖ రాసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు

తెలంగాణకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు లేఖ ఇచ్చారు. ఈ లేఖ కాపీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి కూడా అందజేశారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తమకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి మాట్లాడుతూ ఈ లేఖలో తెలంగాణ హక్కుగా రావాల్సిన అనేక అంశాలు ఉన్నాయని, న్యాయంగా రావాల్సిన నిధులు ప్రధాన మంత్రిని ఆడిగామన్నారు. మెదక్ ఎంపి రఘునందన్ రావు తెలంగాణకు అన్యాయం జరగలేదని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన న్యాయవాది అని తెలంగాణకు ఇంత అన్యాయం అవుతుంటే న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణకు కూడా కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చారని వాటిని న్యాయపరంగా మనకు ఇవ్వలేని వాటిని అడిగితే రఘునందన్ రావు అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం వింతగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, బయ్యారంలో ఇనుప పరిశ్రమ, ఐఐఎం, ఐటిఐఆర్, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు పలు హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. బిజెపి ఎంపిలు తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటిపై పోరాటాలు చేయకుండా మమ్మల్ని విమర్శించడం ఏమిటని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎంపిలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని తమతో పాటు పోరాటానికి సిద్ధం కావాలని మల్లు రవి పిలుపునిచ్చారు.

ఎంపిలు రాసిన లేఖలోని అంశాలు ఇలా….
రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ఆర్థిక మంత్రికి తెలంగాణ ఎంపిలు రాసిన లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. 1. ఐటీఐఆర్ 2. ఐఐఎం 3. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ 4. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాకర్టీ 5. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా 6.తొమ్మిది జిల్లాలను నెనుకబడిన జిల్లాలుగా గుర్తించాలని ఆ లేఖలో ఎంపిలు పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com