Thursday, November 7, 2024

లిక్కర్​ షాక్​

మద్యం ధరల పెంపు..?
త్వరలోనే ఆదేశాలు
15 శాతం వరకు ప్రతిపాదనలు

రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఎక్సైజ్‌ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతోపాటు, ఎన్నికల హామీలు అమలు చేయడానికి మద్యం ధరలను పెంచడమే మార్గంగా కాంగ్రెస్‌ సర్కారు భావిస్తున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో వాటికి సమానం చేయాలని ఆలోచిస్తున్నది. దీంతో రాష్ట్రంలో త్వరలోనే మద్యం ప్రియులకు షాక్‌ తగలనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా బీరుపై రూ.20, లిక్కర్‌ క్వార్టర్‌పై కనీసం రూ.20 నుంచి రూ.70 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రతి నెల అదనంగా రూ.1000 కోట్లు ఆదాయం సమకూరనున్నట్లు లెక్కలు వేస్తున్నారు.

షాక్
రాష్ట్రంలోని మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే మద్యం ధరలకు భారీగా పెంచేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతోంది. అందులో ముఖ్యంగా బీర్ల ధరలను గట్టిగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే.. ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకు ఒకసారి పెంచుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈసారి వివిధ రకాల బ్రాండ్ల మీద 20 రూపాయల నుంచి 150 వరకు పెంచాలని బ్రూవరీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. ఈ మేరకు త్వరలోనే బీర్ల ధరల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అయితే, ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంతో మద్యం ధరలు సుమారు 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మద్యం ధరలను 15 శాతం పెంచితే ఎక్సైజ్ శాఖను ప్రస్తుతం వచ్చే ఆదాయం కంటే అదనంగా మరో 5 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరో రూ.5318 కోట్లు పెంచాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే.. ధరల పెంపు ప్రక్రియ సాగుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
రాష్ట్రంలో మొత్తం 2260 మద్యం దుకాణాలు ఉండగా.. 1171 బార్లు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ.. రాష్ట్రంలో ఉన్న 6 బ్రూవరీల నుంచి బీర్లు సరఫరా అవుతుంటాయి. వీటన్నింటికీ సరఫరా చేసేందుకు ఈ 6 బ్రూవరీల నుంచి ప్రతి ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని మందుబాబులు తాగేశారు. అందులో ముఖ్యంగా.. 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది.
ఇక, మద్యం ధరలు పెరిగితే మద్యంప్రియుల జేబులకు గట్టిగానే చిల్లులు పడనున్నాయి. ఇప్పటికే మద్యం ధరలను ప్రతిసారి పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలతో ప్రభుత్వం ఖాజానాకు భారీ ఆదాయం వస్తుందన్న కారణంతో ప్రభుత్వాలు మద్యం ధరలకు ప్రతిసారి గట్టిగానే పెంచుతుండటం గమనార్హం. మద్యం ధరలు పెరుగుతుండటంతో చాల మంది ప్రజలు ఛీప్ లిక్కర్‌కు అలవాటు పడుతున్నారు. ఇదే అసరాగా చేసుకుని లిక్కర్ కల్తీరాయుళ్లు కూడా గట్టిగానే సొమ్ము చేసుకుంటూ ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular