Tuesday, May 13, 2025

మద్యం ప్రియులకు చేదు వార్త

టూ డేస్​.. నో లిక్కర్​

మద్యం ప్రియులకు రెండు రోజులు మద్యం దొరకదు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని.. జంటనగరాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఇక సిటీలో మహంకాళీ బోనాల బోనాల సంబరం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే లిక్కర్ షాపులు, బార్లు కూడా క్లోజ్ చేయాలని నిర్ణయించారు. జులై 28 బోనాల పండగ సందర్భంగా.. నగరం అంతటా.. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, నాన్ ప్రొప్రయిటరీ క్లబ్‌లు, కళ్లు దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

జూలై 28 ఉదయం 6 గంటల నుంచి 2 రోజుల పాటు వైన్స్ షాపులతో పాటు బార్లు, కళ్లు దుకాణాలు కూడా మూసేయ్యాలని ఆదేశించారు. ఆదివారం రోజున సౌత్ ఈస్ట్ జోన్‌లో బండ్లగూడ, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి జులై 29న ఉదయం 6 గంటల వరకు లిక్కర్ షాపులు క్లోజ్ అవ్వనున్నాయి.

ఇక సౌత్ జోన్‌లో చార్మినార్, హుస్సేనీ ఆలం, కమాటిపురా, ఫలక్‌నుమా, ఛత్రినాక, మొఘల్‌పురా, మీర్‌చౌక్, షాలిబండ ఏరియాల్లో జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు అన్ని రకాలు లిక్కర్ షాపులు, బార్లు క్లోజ్ అవుతాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రై డేలో లిక్కర్ అమ్మకాలు జరిపితే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com