* మద్యం దుకాణాలు బంద్
* నేటి సాయంత్రం నుంచి తెలంగాణలో..
* ఏపీలో మూడు రోజులు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలిచ్చారు. తెలంగాణలో సోమవారం సాయంత్రం నుంచి వైన్‌షాపులను మూసివేయనున్నారు. మళ్లీ బుధవారం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరుసగా మూడు రోజులు మద్యం షాపులు ఓపెన్ కావు. జూన్ 6న ఉదయం తిరిగి వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 4న రోజంతా డ్రై డేగా ఉండనుంది. జూన్ 5వ తేదీ ఉదయం మద్యం షాపులు తెరుచుకుంటాయి.