Thursday, April 3, 2025

విహెచ్ ప్రెస్‌మీట్‌లకు లైవ్‌ లింక్ కట్..!

కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ప్రెస్‌మీట్‌లకు సంబంధించిన లైవ్‌లింక్‌లు ఇవ్వొద్దని నిర్ణయించినట్టు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన విలేకరుల సమావేశానికి అంత ప్రాధాన్యత ఇవ్వొద్దని కూడా గాంధీభవన్ వర్గాలకు ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే విహెచ్ విలేకరుల సమావేశాలకు లైవ్ లింకులు, విలేకరులకు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ALSO READ: కలిసికట్టుగా పనిచేసి పార్లమెంటు స్థానాలు గెలిపించండి

ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతల ప్రెస్‌మెంట్‌లకు సంబంధించి లైవ్ లింక్లు ఇస్తున్నారు. అయితే విహెచ్ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పట్ల అమర్యాదగా మాట్లాడుతున్నారని వారిపై ఆరోపణలు చేస్తున్నారని పలువురు టిపిసిసికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే విహెచ్ ప్రెస్‌మీట్‌లకు లైవ్‌లింక్‌లను కట్ చేయాలని ఆదేశాలు అందినట్టుగా సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com