రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఇంకా 17.14 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదని, 1.20 లక్షల మందికి ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయని, అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయామన్నారు. 1.61 లక్షల మందికి ఆధార్ కార్డు మరియు లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయని, 1.50 లక్షల అకౌంట్లలలో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయిని, 4.83 వేల మందికి రేషన్ కార్డులు లేవని, 8 లక్షల మందికి 2 లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారన్నారు.