కుల గణన రీ సర్వేతో మళ్లీ వాయిదా
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. తాజాగా మరోసారి కులగణన జరగనున్న కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కులగణన సర్వే చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేసిన నేపథ్యంలో.. రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాక ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లలో ఎస్ఈసీ సిద్ధంగా ఉండగా.. ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ వాయిదా తప్పడం లేదు. మార్చిలో ఈ రిజర్వేషన్ల లెక్క తేలితే.. ఆ తర్వాత వరుసగా పరీక్షలు ఉన్నాయి. పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. అందుకే స్థానిక ఎన్నికలు మే వరకు వాయిదా పడే అవకాశాలున్నాయి.
42 శాతం కోసమే..?
కులగణన నివేదిక ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే నివేదికపైనే అసంతృప్తి రావడంతో రీసర్వే నిర్ణయం తీసుకున్నారు. రీ సర్వే కు నిర్ణయం తీసుకోవడంతో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. రీసర్వే తర్వాత మరోసారి డెడికేటెడ్ కమిషన్ కు వివరాలను పంపి ..మరోసారి సిఫారసులు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నారు. కానీ.. రిజర్వేషన్ల సంగతి తేలిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో మరోసారి స్థానిక ఎన్నికలు వాయిదా పడినట్లయింది.
స్థానిక ఎన్నికలకు బ్రేక్
మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ఇప్పటికే రాజకీయ పక్షాల మధ్య వేడి పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న రాజకీయ పార్టీలకు చెక్ పడినట్లే. ఇప్పుడప్పుడే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ముఖ్యంగా బీసీ కుల గణనపై నెలకొన్న సందిగ్ధత తేలేవరకు ఎన్నికలకు వెళ్లకూడదన్నఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ కుల గణన విషయంలో నెలకొన్న సందిగ్ధత తేలేవరకు ఎన్నికలకు పోతే మొదటికే మోసం వస్తుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే సర్వే పూర్తి చేశామని ప్రభుత్వం ఓ వైపు చెబుతుండగా బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని బీసీ కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేసుకుంది. రెండు వారాల్లో ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని ముందుగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తామని చేసిన ప్రకటనలు తుస్సుమన్నాయి.
సీఎం రేవంత్ తో పాటు ముఖ్య నేతలు, అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం తర్వాత ఎన్నికల తేదీలపై ఓ క్లారిటీ వస్తుందనుకున్నారు. కానీ సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి కులగణన చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నెరవేర్చడానికి సమగ్ర కుల గణన పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై అనేక ఆరోపణలు వినవస్తున్నాయి. కుల గణన సరిగా జరగలేదని కొన్ని సంఘాలు, తమ కులాన్ని తక్కువ చేసి చూపారని మరికొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చాలామంది కులగణనలో పాల్గొనలేదని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కుల గణన తేలకుండా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేసింది. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ బడ్జెట్ సమావేశంలో చట్టం చేసి కేంద్రానికి పంపాలని భావిస్తోంది.
మళ్లీ మొదటికి..!
రాష్ట్రంలో కులగణన చాలా పక్కాగా జరిగిందని ప్రభుత్వం అదే పనిగా వాదిస్తోంది. అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకుంది కూడా. ఆ నివేదిక ఆధారంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కూడా సమర్పించింది. ఇప్పుడు మళ్లీ రీ సర్వే అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేక విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది. కులగణన తప్పుల తడక అని తాము వాదించామని ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకుని మళ్లీ సర్వే చేస్తోందని ఇతర పార్టీలు వాదిస్తాయి. అయితే ప్రభుత్వం గతంలో కులగణనలో నమోదు చేసుకున్న వారికి మాత్రం కాదని.. మొత్తంగా 3.1 శాతం మంది నమోదు చేసుకోలేదని వారి కోసమేనని చెబుతోంది. అయితే, ఇప్పుడు డబుల్ ఎంట్రీలు నమోదు చేయించుకుంట…