Sunday, April 20, 2025

Local body elections స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చెల్లవు: సుప్రీం కోర్టు ఆదేశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదలవుతుందనే నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు చెల్లవంటూ తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ బాధ్యత ఈసీదేనని స్పష్టం చేసింది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది.

ఈ విధానం హరియాణా, మహారాష్ట్రలో అమల్లో ఉందని సుప్రీం కోర్టు ఉటంకించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈసీ కూడా అప్రమత్తమైంది. రాష్ట్రాలకు దీనిపై పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఈ నెల 12న రాజకీయ పార్టీలతో చర్చించాలని చెప్పడంతో.. రాష్ట్రంలో రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రాజకీయ పార్టీలు అంగీకరించినా.. లేకున్నా దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని ఈసీ భావిస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com