Monday, May 12, 2025

మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలు

మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలు:
మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. మహారాష్ట్ర లోని మొత్తం 48 లోక్‌సభ నియోజక వర్గాల్లో.. NDA 20 స్థానాల్లో, ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు:
కర్ణాటకలో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ భాగస్వామ్య పక్షమైన జేడీఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలు:
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో 6 నియోజక వర్గాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది.
బీహార్:
బీహార్‌లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. జేడీయు 15 స్థానాలు, బీజేపీ 12, ఎల్జేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆర్జేడీ 3 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్:
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 42 స్థానాల్లో టీఎంసీ 29 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
గుజరాత్:
గుజరాత్‌లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ దిశగా దూసుకు పోతోంది. మొత్తం 26 స్థానాల్లో బీజేపీ 25, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్:
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి లోని టీడీపీ 14, బీజేపీ 4, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
తెలంగాణ:
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ నెలకొంది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 7 స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
మధ్యప్రదేశ్:
మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకు పోతోంది. మొత్తం 25 స్థానాల్లో అన్ని స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
కేరళ:
కేరళలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తోంది. ఐయూఎంఎల్ 2, బీజేపీ 2, సీపీఎం 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు..
పంజాబ్‌:
పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. కాంగ్రెస్ 6 స్థానాలు, ఆప్ 3 స్థానాలు, శిరోమణి అకాలీదళ్ 2 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్:
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ జోరు కొనసాగుతోంది.
మొత్తం 11 స్థానాల్లో బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తుండగా.. కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com