Tuesday, April 22, 2025

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్

2025-26 ఏడాది వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటిస్తున్నారు. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మాలా సీతారామన్‌, ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడం ఇదే. బడ్జెట్‌పై ఆసక్తిగా పేదలు, మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు. ఆదాయపన్ను శ్లాబులను ఆరు నుంచి మూడుకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మందగించిన వృద్ధిరేటు మెరుగుకు మరిన్ని చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. జన్‌ధన్‌, ముద్ర యోజన పథకాలకు కేటాయింపులు పెంచే సూచనలు ఉన్నాయి. గ్రామీణ పేదల సొంతింటి కోసం హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పేరుతో సాయం కేంద్రం సాయం చేయనుంది. పట్టణాల్లో కోటి మందికి ఇళ్ల నిర్మాణానికి సాయం అందించే సూచనలు కనిపిస్తున్నాయి. పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ పథకానికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. పేదలు, మధ్య తరగతి, మహిళల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com