Saturday, October 5, 2024

“లవ్ రెడ్డి” టీజర్ లాంచ్ 

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్,  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 18న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలుగా సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు.
తాజాగా చిత్ర యూనిట్ లవ్ రెడ్డి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ…
మీడియా మిత్రులు మా లవ్ రెడ్డి సినిమా టీజర్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది, ఈ సినిమా తప్పకుండా సెన్సేషనల్ సృష్టిస్తుంది. మంచి సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది, అందరిలాగే మేము కష్టపడి చేశాము, ఆడియన్స్ సినిమా చూశాక తప్పకుండ ఈ సినిమాతో కొంతకాలం జర్నీ చేస్తారు, సినిమా ఎండింగ్ లో ఒక గొప్ప ఫీల్ తో బయటికి వస్తారు, అక్టోబర్ 18న మా సినిమాను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.
డైరెక్టర్ స్మరన్ మాట్లాడుతూ…
ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్ పీపుల్ కు కృతజ్ఞతలు, లవ్ రెడ్డి సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర, మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించింది, అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది, సన్నీ సంగీతం, వరప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, అలాగే మోహన్ చారి, అస్కర్ ఆలీ ఈ సినిమాకు కెమెరామెన్స్ గా వర్క్ చేశారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు సపోర్ట్ మర్చిపిలేనిది, మైత్రి వారు మా సినిమాను రిలీజ్ చెయ్యడం సంతోషంగా ఉందని అన్నారు.
నిర్మాత మదన్ మాట్లాడుతూ…
ఈ సినిమా హీరో అంజన్ రామచంద్ర, డైరెక్టర్ స్మరన్ జర్నీ పది ఏళ్ల నుండి ఉంది, వారిద్దరూ కలిసి చేస్తున్న సినిమా లవ్ రెడ్డి, మంచి కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇది, అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular