Tuesday, December 24, 2024

డిగ్రీ విద్యార్థిని చెయ్యిని కోసిన ప్రేమోన్మాది

  • మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం…
  • మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు తరలింపు
  • పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు

ప్రేమోన్మాదులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మూల యువతులపై దాడులు పెట్రేగిపో తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి  మెదక్‌ ‌పట్టణంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జరిగింది. తనను ప్రేమించడం లేదంటూ..  డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఓ ప్రేమోన్మాది అందరూ చూస్తుండగానే  కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే… మెదక్‌  ‌ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్‌ ‌డిగ్రీ పరీక్షలు రాయడానికి  ప్రభుత్వ కాలేజీకి వొచ్చిన యువతిపై  అక్కడే వున్న చేతన్‌ అనే యువకుడు ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. యువతిని కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అతని నుంచి తప్పించుకోవడంతో ఆమె తీవ్ర గాయాలతో బయటపడింది.

ప్రేమించడం లేదని యువతిపై చేతన్‌ అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. కత్తితో దాడి చేస్తున్న చేతన్‌ను యువతి అడ్డుకోబోయింది. అయినా, చేతన్‌ ఆమెపై విరుచుకు పడ్డాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఇది గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు. ఈ ప్రమాదంలో యువతి చేతికి తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం ఆమెను స్థానికులు సమీప దవాఖానకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు చేతన్‌ ‌పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మెదక్‌ ఎస్‌పి  ఉదయ్‌ ‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పోలీస్‌లు నిందితుడు చేతన్‌ ‌కోసం ప్రత్యేక పోలీస్‌ ‌బృందం గాలింపు చర్యలు చేపట్టింది. మెదక్‌ ‌పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓపెన్‌ ‌డిగ్రీ పరీక్షలు రాసేందుకు మెదక్‌కు వొచ్చిన యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది చేతన్‌ ‌బెంగళూరు నుంచి వొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com