మెగా కోడలు, రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఫ్యామిలీ ఈవెంట్స్, సామాజిక కార్యక్రమాల తాలూకు ఫొటోలు, వీడియోలను ఆమె ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నేడు వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు.
‘ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు, లేదా అంతకంటే తక్కువ వయసు కలిగిన అమ్మాయిల కోసం. ఒకవేళ మీరు ఆ వయస్సును దాటిపోయి ఉంటే.. ఆంటీలు దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి’ అంటూ ఒక స్మైలీ ఎమోజీని జోడించారు ఉపాసన. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది ఈ పోస్ట్ చూసి వింతగా ఆశ్చర్యపోతున్నారు. ఒక స్పెషల్ ‘డే’ అనుకుని సెలబ్రేట్ చేసుకోవడానికి వయసుతో సంబంధం ఏముందని కొందరి అభిప్రాయం.