Saturday, May 17, 2025

లగ్జరీ కార్ల దందా 100 కోట్ల పన్ను ఎగవేత

లగ్జరీ కార్ల కొనుగోలు విషయంలో సుమారు రూ.100 కోట్ల పన్ను ఎగవేసిన కేసులో గచ్చిబౌలిలోని కార్‌ లాంజ్‌ షోరూం యజమాని బషారత్‌ అహ్మద్‌ ఖాన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. షోరూం యజమాని ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, హైదరాబాద్‌కు చెందినఈ ఇద్దరిని డిఆర్ఐ అధికారులు ఇంటరాగేట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా బషారత్‌ వద్ద ఎవరెవరు కార్లు కొనుగోలు చేశారు. ఎంతమొత్తం పన్ను ఎగవేశారు తదితర వివరాలను సేకరిస్తున్నారు.
ఇప్పటికే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అదుపులో ఉన్న హైదరాబాద్ డీలర్ బషారత్ అహ్మదాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కోర్టు సమయం తీసుకోనుంది.పన్ను ఎగవేత కేసులో మూడు రోజుల క్రితం బషారత్‌ను అహ్మదాబాద్ డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పన్ను ఎగవేసినందుకు 7 కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు కోరింది. అయితే రూ. కోటి చెల్లించి బెయిల్ పిటిషన్ వేసినట్లు తెలిసింది. కాగా బషారత్‌ ఇప్పటివరకు రూ.25 కోట్ల పన్ను ఎగవేసినట్లు డీఆర్ఐ గుర్తించింది.

లగ్జీరీ కార్ల పన్ను ఎగవేత కేసు
కాగా లగ్జీరీ కార్ల పన్ను ఎగవేత కేసు అహ్మదాబాద్‌లో నమోదైంది. ఈ కేసు ఆధారంగా డీఆర్ఐ అధికారులు బషారత్‌ అహ్మద్‌ ఖాన్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కోర్టులో హాజరుపరిచారు. కాగా బషారత్‌ అమెరికా, జపాన్‌లలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి దుబాయ్‌, శ్రీలంక మీదుగా భారత్‌కు తీసుకువచ్చినట్లు డీఆర్‌ఐ గుర్తించింది. విదేశాల నుంచి కార్లు దిగుమతి చేసుకోవాలంటే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ పన్నులు తప్పించుకోవడానికి అహ్మద్‌ ఈ మార్గంలో కార్లు దిగుమతి చేసుకున్నట్లు డీఆర్‌ఐ విచారణలో తేలింది. ఈ క్రమంలో విదేశీ లగ్జరీ కార్ల అసలు ధరను తక్కువగా చూపించడంతో పాటు 50 శాతం తక్కువకు నకిలీ ఇన్‌వాయిస్‌లు తయారు చేశారు, కస్టమ్స్‌ సుంకాన్ని ఎగవేసేందుకు అమెరికాలో కొన్న కారును శ్రీలంక ద్వారా భారత్‌కు తీసుకొచ్చేవారని అధికారులు తెలిపారు.
ఇలా దేశంలోకి వచ్చిన కార్లను అహ్మదాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో దాచిపెట్టినట్టుగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు బషారత్‌ అహ్మద్‌ ఖాన్‌ వద్ద కార్లు కొనుగోలు చేశారు, అలా వారు ప్రతికారుకు పూర్తిగా నగదు చెల్లించి నట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. అమెరికా, జపాన్‌లో కొన్న ఈ ఖరీదైన లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ కార్లను శ్రీలంకకు తీసుకు వచ్చాక ఇండియాలో వాడేందుకు వీలుగా తరలించాక అక్కడ భారత్‌లో వాడేందుకు వీలుగా రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌కు మార్చారు. ఆ తర్వాత వాటికి అనుగుణంగా పత్రాలు సృష్టించారు. ఈ విధంగా సుమారు 30 కార్లను తెప్పించారు. ఇక ఈ కార్లను కొన్న పలువురు సెలబ్రిటీలను డీఆర్‌ఐ అధికారులు ప్రశ్నంచనున్నారు. వీరిలో పన్ను ఎగవేతలో భాగస్వాములైన వారిపై దర్యాప్తు కొనసాగస్తామని అధికారులు తెలిపారు.
ఇక ప్రస్తుతం డీఆర్‌ఐ అధికారుల అదుపులో ఉన్న కార్‌లాంజ్‌ షోరూం యజమాని బషారత్‌ అహ్మద్‌ ఖాన్‌ పదేళ్లుగా కార్ల షోరూం ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు ఎనిమిది లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్న ఖాన్‌ ప్రభుత్వానికి రూ.7 కోట్ల వరకు కస్టమ్స్ సుంకం ఎగవేశాడు. అలా దిగుమతి చేసుకున్న కార్లను తన వ్యాపార భాగస్వామి అయిన డాక్టర్‌ అహ్మద్‌కు చెందిన ఫామ్‌ హౌజ్‌లో దాచిపెట్టేవారని తేలింది. ఇక ఆ కార్లను విక్రయించడానికి తనకున్న రాజకీయ పరిచయాలు ఉపయోగించుకున్నాడు. అలాగే కార్లు కొన్నవారినుంచి డబ్బును నగదు రూపంలోనే తీసుకున్నట్లు తెలిసింది. దీనివల్ పన్ను అధికారుల దృష్టిలో పడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఖాన్‌ హైదరాబాద్‌తో పాటు ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో కూడా విస్తరించిందని డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి ఆయా ఏరియల్లో కొన్న లగ్జరీ కార్లతో సుమారు రూ.100 కోట్ల వరకు పన్ను ఎగవేసినట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో విచారించి తుది వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com