టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ లిరిక్ రైటర్ కులశేఖర్ (53) హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు. పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాతి రోజుల్లో మానసికంగా చాలా కుంగిపోయారు. విశాఖపట్నంకు చెందిన కులశేఖర్ మొదట హైదరాబాద్‌లో జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత లిరిక్ రైటర్‌గా మారారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెళకువలు తెలుసుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జయం’, ‘నువ్వు నేను’, ‘భద్ర’, ‘సంతోషం’, ‘ఔనన్నా కాదన్నా’, ‘వసంతం’, ‘రామ్మా చిలకమ్మా’, ‘వసంతం’, ‘మృగరాజు’, ‘సుబ్బు’, ‘సైనికుడు’ వంటి చిత్రాల్లో సూపర్‌హిట్ పాటలు రాశారు.