తెలంగాణ హైకోర్టులో పసునూరి వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది తన వాదనలు వినిపిస్తుండగానే గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరగిన ఈ ఘటన అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. ఓ న్యాయవాది వాదనలు వినిపిస్తూనే ప్రాణాలు విడిచారు. పసునూరు వేణుగోపాల్ అనే లాయర్ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుప్పకూలారు. వెంటనే కోర్టు సిబ్బంది, ఇతర న్యాయవాదులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.