Thursday, November 14, 2024

మాకు అధికారం ఉంది

క్ర‌మ‌ణ‌ల‌పై నోటీసులు ఇస్తాం
బతుకమ్మకుంటను పున‌రుద్ధ‌రిస్తాం
కూల్చివేత‌ల‌పై నిర్ణ‌యం తీసుకోలేదు
హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్‌

చెరువులు, కుంట‌ల‌ను క‌బ్జా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాథ్ అన్నారు. హైడ్రా నోటీసులు అక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయని వెల్లడించారు. బుధ‌వారం ఉదయం అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట ప్రాంతంలో ఆక్రమణలకు గురైన ప్రాంతాన్నిహైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బతుకమ్మకుంటపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవని, కేవలం బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని, ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చినట్లు చెప్పారు.

ఉన్న‌దాంట్లోనే పున‌రుద్ధ‌ణ‌
ప్రస్తుతం ఉన్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామని రంగ‌నాథ్ వెల్ల‌డించారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని, హైడ్రా నోటీసులు అక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయని హెచ్చ‌రించారు. నాగారంలో రోడ్డు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను బుధ‌వారం కూల్చేశామని తెలిపారు. ఐదు కాలనీలకు వెళ్ళే రోడ్డును ఆక్రమించారని, తమకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో సర్వే చేశామన్నారు. 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలను తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
అయితే బతుకమ్మకుంట వద్ద హైడ్రా కమిషనర్ పర్యటన నేపథ్యంలో బుధ‌వారం ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మకుంట ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే బతుకమ్మకుంటను పరిశీలించాలని రంగనాథ్ నిర్ణయించారు. రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే తమ ఇళ్లను కూల్చవద్దంటూ స్థానికులు నిరసనకు దిగారు. ఇళ్లను తొలగించకుండా చెరువు సుందరీ కరణ పనులు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. చివరకు బతుకమ్మకుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్.. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇండ్లను కూల్చబోమని.. కేవలం బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామని చెప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

మళ్లీ కూల్చివేతలు
మరోవైపు నగరంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. బుధ‌వారం నాగారంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్‌నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేసింది. రెండు బృందాలుగా ఏర్పడి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular