భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఆపరేషన్ సింధూర్ తరువాత ఏర్పడిన ఉద్రిక్తతతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. రెండు దేశాలతో సంప్రదింపులు చేసినట్లు చెప్పారు. కాల్పుల విరమణకు రెండు దేశాల అంగీకరించినట్లు ప్రకటించారు. ఆ తరువాత భారత్ – పాక్ నుంచి కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ప్రకటించాయి. కొద్ది సేపటికే పాక్ నుంచి కాల్పులు తిరిగి ప్రారంభమైనా.. తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, ఇప్పుడు ట్రంప కాశ్మీర్ అంశం పైన స్పందించారు. భారత్ – పాక్ కు భారీ ఆఫర్ ఇచ్చారు. మధ్యవర్తిత్వానికి సిద్దం భారత్, పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. కాల్పులు విరమించకపోతే లక్షలాది మంది చనిపోయేవారని చెప్పారు. భారత్, పాక్ బలమైన నాయకత్వాల పట్ల తాను గర్వపడుతున్నట్లు తెలిపారు. కశ్మీర్ సమస్యకు వెయ్యేళ్ల తర్వాత అయినా పరిష్కారం లభిస్తుందేమో, లేదే చూడాలన్నారు. అయితే కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో రెండు దేశాలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. అలాగే రెండు దేశాలతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని తెలిపారు. చాలా మంది మరణానికి, విధ్వంసానికి దారితీసే ఈ యుద్ధాన్ని ఆపడం తెలివైన నిర్ణయమని చెబుతూ.. రెండు దేశాల నాయకులకూ ట్రంప్ తన కృతజ్ఞతలు తెలియజేశారు. వాణిజ్యం పెంచుకుంటాం అటు.. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా మధ్యవర్తిత్వంతో తగ్గాయి. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్, పాక్ మధ్య ఇప్పుడు సీజ్‌ఫైర్ ఉంది. ఈ విషయాన్ని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ తర్వాత ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ గురించి ప్రకటించాయి. అయితే తాజాగా ట్రంప్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. యుద్ధం సృష్టించే విధ్వంసాన్ని రెండు దేశాలు అర్థం చేసుకున్నాయని ట్రంప్ అన్నారు. రెండు దేశాల్లో శక్తిమంతమైన, అచంచలమైన నాయకత్వాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉందన్న ట్రంప్ అన్నారు. రెండు దేశాలతో వాణిజ్యం పెంచుకుంటామని కూడా ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించించారు. ట్రంప్ ప్రశంసలు రెండు దేశాల నాయకత్వం సమర్ధవంతంగా పని చేసిందని ట్రంప్ ప్రశంసించారు. పహల్గాం ఉగ్ర దాడి తరువాత్ భారత్ సీరియస్ గా స్పందించింది. ఆపరేషన్ సింధూర ద్వారా పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్ర శిబిరాలను నేల మట్టం చేసింది.