Tuesday, April 22, 2025

ఘనంగా మాయా ప్రీ రేలీజ్

విన్ క్లౌడ్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం మాయ. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని తాజా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు, మూవీ స్క్రీన్ ప్లే విన్న వెంటనే సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మినట్లు హీరో కిరణ్ ఆవల వెల్లడించారు.

సినిమా ప్రివ్యూ వేసినప్పుడు తన నమ్మకం నిజమైందని తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టి కొట్టాడు అని కొనియాడారు. కిరణ్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ కూడా వీళ్ళకే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మూవీని ప్రోత్సహించడానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సత్యం రాజేష్, అనుదీప్ చౌదరి ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాయ చిత్రం నిర్మాత రాజేష్ ఎంతో ఉత్సాహంతో అలాగే నమ్మకంతో పెట్టుబడి పెట్టారని తెలిపారు. నేడు ప్రేక్షకుడు టెక్నికల్ గా చాలా అడ్వాన్స్బుగా ఆలోచిస్తున్నాడని అందుకనే పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా మాయా చిత్రం ఉంటుందని కిరణ్ ఆవల తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com