Tuesday, April 22, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ మరోసారి నవ్వులు పూయించగలదా?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. కామెడీ మూవీస్‌ అంటే దాదాపుగా హిట్‌ అవుతాయి అందులో నో డవుట్‌ అయితే మొదటి భాగానికి సీక్వెల్‌గా తీసిన చిత్రాలు మాత్రం బెడిసికొడుతూ ఉంటాయి. కాకపోతే ఇది కామెడీ జానర్‌ కాబట్టి ‘మ్యాడ్‌’ చిత్రం మంచి హిట్‌ అవ్వడంతో ‘మ్యాడ్‌ స్క్వేర్’ కూడా అదే బాటలో నడుస్తుందని ప్రేక్షకుల అంచనాలు ఉన్నాయి. ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ వంటి ఘన విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘మ్యాడ్ స్క్వేర్’తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ను సాధిస్తామనే నమ్మకంతో సితార ఉంది. మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారో లేదో తెలియాలంటే మార్చి 28 వరకు ఆగాల్సిందే మరి.

మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. రెబా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ తదితరులు కీలక పాత్రలలో అలరించనున్నారు.

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం, ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్‌ ను రాబడుతుంది ఆనందంలో సందేహం లేదు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com