Tuesday, November 19, 2024

జనగామలో లభించిన మహా తలవర నాణెం

* జనగామలో లభించిన మహా తలవర నాణెం
* గుర్రం గుర్తుతోపాటు అర్ధవృత్తాకారంలో శివసేబకస 
జనగామ జిల్లాలో అతి పురాతనమైన నాణం లభించింది. పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారులోని పాటిగడ్డలో ఈ అరుదైన నాణెం దొరికింది. ఇక్ష్వాకుల కాలంలో ముద్రించిన ఈ నాణెంపై గుర్రం గుర్తుతో పాటు అర్ధవృత్తాకారంలో శివసేబకస అనే గుర్తు బ్రహ్మలిపిలో ఉందని చరిత్రకారుడు రత్నాకర్‌ రెడ్డి చెప్పారు. ఇలా ప్రత్యేకంగా గుర్రం గుర్తు ఉన్న నాణేలను మహా తలవర నాణేలు అంటారని ఆయన తెలిపారు.
ఇక ఈ నాణేలకు మహత్తర చరిత్ర ఉందట. మహా తలవర అంటే గొప్ప కాపలాదారు అని అర్థం వస్తుంది. నాణేనికి బొరుసు వైపు రెండు కొండలు, పైన మరొక కొండ కలిపి మూడు ఆర్చ్ ల వలె ఉన్నాయి. మళ్లీ ప్రతి కొండలోపల ఆరు చుక్కలు ఉన్నాయి. కొండల దిగువన ఒక నది ఉంది. ఇవన్నీ మొత్తం రెండు వరసల చతురస్రంతో చుట్టి ఉండటం విశేషం.
ఇక ఈ నాణెం బరువు 5 గ్రాముల 834 మిల్లి గ్రాములు ఉంది. పైగా నాణానికి ఒక రంధ్రం ఉండటం ప్రత్యేకత. దీన్ని మెడలో లాకెట్ గా ధరించే వారని తెలుస్తోంది. నాణానికి ఉన్న రంధ్రం కారణంగా పిరమిడ్ ఆకారంలో ఉండే బ్రహ్మ ధ్వజం కనిపించడం లేదని చెబుతున్నారు. 1953లో ఫనిగిరిలో పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాలలో మహా తలవర 40 నాణాలు బయటపడ్డాయి. ఇక్ష్వాకుల కాలంలో మహా తలవర మజ సామికస శివ సేబకస పాలించాడని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular